Indraganti: సెంటిమెంట్ ను బయటపెట్టిన ఇంద్రగంటి
ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సినిమాకు ఒకటి వర్కవుట్ అవడం ఆలస్యం దాన్ని సెంటిమెంట్ పేరుతో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ డైరెక్టర్లకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. పూరీ జగన్నాథ్(Puri Jagannadh)తన సినిమా కథను బ్యాంకాక్ లో రాసుకోవడం ఆయనకు సెంటిమెంట్.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన కథను వైజాగ్ లో రాసుకుని తర్వాత అక్కడే గుడిలో పూజ చేయించుకోవడం అతనికి సెంటిమెంట్. అలా ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti Mohana Krishna)కు కూడా ఓ సెంటిమెంట్ ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తాను ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నానని, ఇప్పటివరకు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని, తను ప్రతీ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టే ముందు ఫస్ట్ పేజీలో ఓం నషస్మి అని రాస్తా అని, అందరూ దాన్ని మంత్రం అనుకుంటారని కానీ అది మంత్రం కాదని, దాని అర్థం ఓంపురి(Ohm Puri), నజీరుద్దీన్ షా(Naziruddhin Shah), షబానా అజ్మి(Shabana Azmi), స్మితా పాటిల్(Smitha Patil) అని, వాళ్లు తన ఫేవరెట్ యాక్టర్స్ అని అందుకే వారి పేర్లు రాసుకుంటానని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.






