Rashmika: పాత్ర నచ్చితే బామ్మగా అయినా చేస్తా: రష్మిక
ఛలో(Chalo) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన రష్మిక(Rashmika) అప్పటినుంచి వరుస ఛాన్సులతో వెనక్కు తిరిగి చూసుకునే పనే లేకుండా దూసుకెళ్తుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక తన తాజా మూవీ ఛావా ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. కథ బావుంటే తాను నలుగురు పిల్లల తల్లి పాత్రలో అయినా నటిస్తానని రష్మిక తెలిపింది.
తల్లి పాత్రే కాదు, కథ నచ్చితే బామ్మ పాత్రలో అయినా నటిస్తానని, సినిమాలో భాగం అవాలని అనుకున్నప్పుడు పాత్ర గురించి ఆలోచించనని రష్మిక తెలిపింది. తన మూవీస్ సక్సెస్ అవడం వెనుక తానెలాంటి ప్లాన్స్ చేయలేదని, అదృష్టం వల్లే తన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని రష్మిక మందన్నా వెల్లడించింది.
ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, తాను జీవితంలో దేన్నీ సీరియస్ గా తీసుకోనని, ప్రతీదీ ఆలోచించడం మొదలుపెడితే లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుందని అందుకే తాను పెద్దగా ఆలోచించనని నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళతానని, ఏదో శక్తి తనను నడిపిస్తుందని నమ్ముతానంటోంది. ఛావా(Chhava) సినిమాలో యేసుబాయి పాత్ర నటించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపింది రష్మిక.













