Mohan Lal: మోహన్ బాబు విలన్ అయితే ఫస్ట్ షాట్ లోనే కాల్చి చంపేస్తా

మంచు విష్ణు(manchu vishnu) హీరోగా నటించిన భారీ సినిమా కన్నప్ప(kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమాను మంచు మోహన్ బాబు(mohan babu) నటిస్తూ నిర్మించారు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas), బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay kumar), మలయాళ స్టార్ మోహన్ లాల్(mohan lal), శరత్ కుమార్(sarath kumar), కాజల్(kajal), బ్రహ్మానందం(brahmanandam) కీలక పాత్రల్లో నటించారు. ఇంతటి భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ కానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ కేరళలోని కొచ్చిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మంచు విష్ణు, మోహన్ బాబు తో పాటూ చిత్ర యూనిట్ కూడా పాల్గొంది. ఈ కార్యక్రమానికి మోహన్ లాల్ చీఫ్ గెస్టుగా వచ్చి మోహన్ బాబు గురించి మాట్లాడి ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.
తాను ఇప్పటివరకు చూసిన స్వీటెస్ట్ పర్సన్స్ లో మోహన్ బాబు కూడా ఒకరని అనగా, మీతో కలిసి నటించాలనుందని, మీ సినిమాలో విలన్ గా చేస్తానని మోహన్ బాబు, మోహన్ లాల్ తో అన్నారు. దానికి మోహన్ లాల్, మీరు ఇప్పటికే 600 సినిమాలు చేశారని, కాబట్టి మీరే హీరో, మీ సినిమాలో విలన్ గా చేసే భాగ్యాన్ని నాకివ్వండని అన్నారు. మీరు అలా అనొద్దు, మీ మూవీలో విలన్ గానే చేయాలనుకుంటున్నా, దయచేసి అవకాశమివ్వమని మోహన్ బాబు అనగా, విలన్ గానే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆంటోనీ ఇది కుదురుతుందా అని కింద ఉన్న డైరెక్టర్ ను మోహన్ లాల్ అడగ్గానే ఆయన ఓకే చెప్పాడు. దాంతో వెంటనే మోహన్ లాల్ రియాక్ట్ అవుతూ, మీరు విలన్ గా చేస్తే ఫస్ట్ సీన్ లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా అని అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం వారి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://x.com/whynotcinemass_/status/1933896564793016767