Keerthy Suresh: అవకాశమొస్తే ఆ హీరో ఫ్యామిలీతో కలిసి ఉంటా!

కీర్తి సురేష్(keerthy suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పన్లేదు. తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి, నేను శైలజ(nenu sailaja) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానటి(mahanati) సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
కానీ బాలీవుడ్ డెబ్యూతో కీర్తి అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం కీర్తి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu) సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి యాంకర్ సుమ(Suma)తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఆ ఇంటర్య్వూలో కీర్తి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. మళ్లీ లాక్ డౌన్ వస్తే ఏ హీరోతో కలిసి ఉండాలనుకుంటున్నావని కీర్తిని సుమ అడగ్గా, వెంటనే నాని(Nani) పేరు చెప్పేసింది కీర్తి. నానితో, నాని భార్య అంజు(Anju)తో, నాని కొడుకు అర్జున్(Arjun) తో ఉండాలనుకుంటున్నట్టు కీర్తి వెల్లడించింది. కాగా నాని, కీర్తి సురేష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గతంలో నేను లోకల్(Nenu Local), దసరా(Dasara) సినిమాలు చేయగా రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్లయ్యాయి.