Dhanush: ధనుష్ మూవీ వాయిదాకు కారణమిదే
హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, సింగర్ గా తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ధనుష్(Dhanush) స్వీయ దర్వకత్వం వహిస్తున్న సినిమా ఇడ్లీ కడై(Idly Kadai). ఈ మూవీ సమ్మర్ గిఫ్ట్ గా ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తానని ధనుష్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఇడ్లీ కడైకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తవకపోవడం వల్లే సినిమా వాయిదా పడుతుందని, ఈ సినిమాలోని కొన్ని సీన్స్ విదేశాల్లో తెరకెక్కించాల్సి రావడంతో సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. అందుకోసమే సినిమాను ఏకంగా ఆరు నెలల పాటూ వాయిదా వేసి అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
తిరు(Thiru) సినిమా తర్వాత మరోసారి నిత్య మీనన్(Nithya Menon) ఈ సినిమాలో ధనుష్ తో కలిసి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తిరు మూవీ సూపర్ హిట్ అవడంతో పాటూ ఆ సినిమా నిత్య కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. తిరు తర్వాత వారి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఇడ్లీ కడై మీద అందరికీ మంచి అంచనాలున్నాయి. ఎన్ని అంచనాలున్నా సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేస్తామని చెప్పి సడెన్ గా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేయడం పై ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.













