క్రిస్మస్ సందర్భంగా ఇద్దరి లోకం ఒకటే
రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా నటిస్తున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై శిరీస్ నిర్మాతగా రూపొందుతోంది. జిఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ మంచి కథతో రూపొందించిన చిత్రమన్నారు. బెక్కం వేణుగోపాల్, లైన్ ప్రొడ్యూసర్ రత్నం అందరూ బాగా సహకరించారన్నారు. ఈ సినిమాలో రాజ్ చాలాబాగా నటించాడని అన్నారు. తను కొత్తగా కన్పిస్తాడని అన్నారు. షాలిని పాండే అద్భుతంగా చేసిందన్నారు.













