Ibrahim Ali Khan: అదేమీ మంచి సినిమా కాదు, తప్పుని ఒప్పుకున్న హీరో

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(saif ali khan) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇబ్రహీం అలీ ఖాన్(ibrahim ali khan) డెబ్యూ పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇబ్రహీం చూడటానికి అందంగా ఉండటంతో పాటూ తన తండ్రి పోలికలు కూడా ఉండటంతో అతని ఎంట్రీ తప్పకుండా గ్రాండ్ గా ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఇబ్రహీం మొదటి ప్రాజెక్టు ఎవరూ ఊహించని ఫలితాన్ని అందుకుంది.
ఇబ్రహీం నటించిన మొదటి ఓటీటీ మూవీ నదానియన్(nadaniyan) ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయకపోగా, ఆ మూవీ వచ్చాక ఇబ్రహీం విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. అయితే తాజాగా నదానియన్ గురించి మాట్లాడాడు ఇబ్రహీం. ఆ సినిమా విషయంలో వచ్చిన విమర్శలు తననెంతో ప్రభావితం చేశాయని, ఆ సినిమా మంచి మూవీ ఏమీ కాదని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే తాను ఆ ప్రాజెక్టును చేశానని, తప్పును ఎంతో నిజాయితీగా అంగీకరించాడు.
నదానియన్ డిజాస్టర్ తర్వాత ఇబ్రహీం, సర్జమీన్(sarzameen) అనే సినిమా చేయగా ఆ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇప్పుడు ఇబ్రహీం తన దృష్టంతా తర్వాత రానున్న డిలేర్(Diler) పై పెట్టాడు. డిలేర్ కోసం తానెంతో కష్టపడ్డానని, గతంలో తన యాక్టింగ్ పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆ లోపాలను సరిదిద్దుకున్నానని చెప్పాడు. మరి డిలేర్ అయినా ఇబ్రహీంకు మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.