Mohanlal: నా పాత సినిమాలు చూడటం మానేశా.. ఎందుకంటే

ఏ హీరో అయినా తాము నటించిన సూపర్ హిట్ సినిమాలను చూసుకుని మురిసిపోతూ ఆ మూమెంట్స్ ను తలచుకుని ఎంజాయ్ చేస్తుంటారు. రీరిలీజుల ట్రెండ్ వచ్చాక అలా మురిసిపోవడాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(mohanlal) మాత్రం తాను నటించిన పాత సినిమాలు చూడటం మానేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే ఎందుకలా చూడటం మానేశారని అడగ్గా దానికి ఆయన చెప్పిన ఆన్సర్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. మోహన్ లాల్ కొన్నాళ్ల కిందట తాను నటించిన సూపర్ హిట్ సినిమా చంద్రలేఖ(chandra lekha) చూశానని, అందులోని ఎంతో కీలక సన్నివేశమైన హాస్పిటల్ లో సీన్ చూసి చాలా బాధ పడినట్టు తెలిపారు. ఆ సీన్ లో తనతో పాటూ యాక్ట్ చేసిన ఎవరూ ఇప్పుడు జీవించి లేరని, అందరూ చనిపోయారని తెలిశాక తనకు చాలా బాధేసిందన్నారు.
వారితో తనకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయని, అలాంటి నటులు ఇప్పుడు లేరని తలచుకుంటే బాధేస్తుందని అన్నారు. ఈ రీజన్ తోనే తాను తన గత సినిమాలను చూడటం మానేసినట్టు మోహన్ లాల్ చెప్పారు. ఇదిలా ఉంటే మోహన్ లాల్ నటించిన తాజా సినిమా హృదయపూర్వం(Hrudayapoorvam) ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan) కీలక పాత్రలో నటించారు.