Mrunal Thakur: బట్టల కోసం లక్షల్లో ఖర్చు పెట్టలేను

సాధారణ మనుషుల్లానే సెలబ్రిటీలకు కూడా ఖర్చులుంటాయి. అయితే సెలబ్రిటీలు కాబట్టి వారికి అన్నీ ఉచితంగానే వస్తాయని అనుకోలేం. హీరోయిన్ అన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ గా ఉంటూ, ఏదైనా ఈవెంట్ కు వెళ్తే రెడ్ కార్పెట్ పై అందంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. అలా కనిపించడం కోసం వారు ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కానీ మృణాల్(mrunal thakur) మాత్రం ఆ ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సీరియల్ నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన మృణాల్ ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి, సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీతగా టాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్, హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో మరింత దగ్గరైంది.
అయితే మృణాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హై ఫ్యాషన్ లుక్ ను ఎలా మెయిన్‌టెయిన్ చేస్తుందో వెల్లడించింది. తనకు కాస్ట్లీ బట్టలు కొనడం ఇష్టముండదని, పర్సనల్ గా తాను కొనే బట్టలేవైనా రూ.2000 లోపే ఉంటాయని, బట్టల కోసం ఎక్కువ ఖర్చు పెట్టినా వాటిని తాను ఒకటి, రెండు సార్లకు మించి వాడనని, అందుకే తాను ప్రమోషన్స్ కోసం, ఈవెంట్స్ కోసం లక్షల విలువైన బట్టలను కొనకుండా రెంట్ తీసుకుని తక్కువ ఖర్చుతోనే స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేస్తానని తన సీక్రెట్ ను బయటపెట్టింది.