డిసెంబర్ 7న ‘హుషారు’ విడుదల
నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుకగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న తాజా చిత్రం హుషారు. ప్రధానంగా యూత్‌కు నెక్ట అయ్యే కథ, కథనాలు చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటాయని యూనిట్ చెబుతోంది. అర్జున్‌రెడ్డి చిత్రంలో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్, సినిమాటోగ్రఫీ రాజ్‌తోట ఈ చిత్రానికి పనిచేయటం అభినందనీయం అని అంటున్నారు. లక్కీ మీడియా సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న బెక్కెం వేణుగోపాల్ టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించింది. మేము వయసుకు వచ్చాం.. సినిమా చూపిస్త మావ లాంటి హిట్ చిత్రాలను నిర్మించారు. డిసెంబర్ 7న విడుదల చేయనున్నామని యూనిట్ అధికారికంగా తెలిపింది.













