Dragon: ఎన్టీఆర్ ఎంట్రీ కోసం భారీ సెట్

దేవర(devara) సినిమా తర్వాత వార్2(war2) సినిమాను పూర్తి చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కెజిఎఫ్(KGF), సలార్(Salaar) ఫేమ్ ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీక్వెన్స్ కోసం మేకర్స్ ప్రస్తుతం భారీ సెట్ ను వేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ లుక్, గెటప్ చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ ఈ సీక్వెన్స్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని మరీ డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటూ దాదాపు వేయి మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా స్క్రీన్ పై కనిపిస్తారని అంటున్నారు. అంటే ఈ సెట్ వేస్తుంది ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసమై ఉండొచ్చు. ఏదేమైనా ఎన్టీఆర్ నీల్(NTRNeel) సినిమాలో హీరో ఎంట్రీ సీన్ నెక్ట్స్ లెవెల్ లో ఉండటం మాత్రం పక్కా అని తెలుస్తోంది.
ఈ సినిమాను అటు ఎన్టీఆర్ కెరీర్ తో పాటూ, తన కెరీర్లో కూడా బెస్ట్ గా నిలబెట్టాలని నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ మూవీ స్క్రిప్ట్ పై నీల్ చాలా కాలం పాటూ వర్క్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్)(Ravi Basrur) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.