తమన్ పై భారీ ఒత్తిడి
సర్కారు వారి పాటతో చేసిన గాయాన్ని గుంటూరు కారం సినిమాకు మంచి ఆల్బమ్ ఇచ్చి మానుస్తాడేమో అనుకుంటే తమన్ ఈ సినిమాకు కూడా అంతంతమాత్రంగానే ట్యూన్స్ ఇచ్చాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్ తప్ప మిగిలినవన్నీ యావరేజ్ ట్యూన్సే. కనీసం రీరికార్డింగ్ అయినా బాగుందా అంటే అదీ లేదు. దీంతో ఇప్పుడు తమన్ పై భారం బాగా పెరిగింది.
ఈ ఏడాది తమన్ కు చాలా కీలకం కానుంది. తమన్ చేతిలో పలు పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. సెప్టెంబర్ 27న ఓజీని రిలీజ్ చేస్తున్టన్లు మేకర్స్ డేట్ ఇచ్చారు కాబట్టి ఏపీ ఎలక్షన్స్ అవగానే జరిగే షూటింగ్కు ఎప్పటికప్పుడు రీరికార్డింగ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ కోసం శంకర్ నుంచి ఎప్పుడైనా కాల్ రావొచ్చు కాబట్టి ఆ సినిమాకు కూడా ఎక్కువ టైమ్ కేటాయించాల్సి ఉంటుంది.
వీటి కంటే ముందు బాలీవుడ్ బేబీ జాన్ రిలీజ్ కానుంది. సన్నీ డియోల్-గోపీ చంద్ మలినేని సినిమా తమన్ చేతికే వచ్చే ఛాన్సుంది. సిద్దు జొన్నలగడ్డ- నీరజ కోన కాంబోలో వస్తున్న తెలుసు కదా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీటితో పాటూ అన్నింటికంటే చెప్పుకోవాల్సింది ది రాజా సాబ్. ఈ సినిమాలన్నింటినీ డిసెంబర్ లోపే తమన్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఈ ఆరేడు నెలలు తమన్ పై బాగా ఒత్తిడి ఉండటం ఖాయం. తనపై వస్తున్న నెగిటివిటీని పోగొట్టుకోవాలంటే తమన్ వీటిలో కనీసం మూడైనా మంచి ఆల్బమ్స్ ఇవ్వాల్సి ఉంది.













