People Media Factory: మిరాయ్ సక్సెస్ ను కాపాడుకోవడానికి భారీ జాగ్రత్తలు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory). టాలీవుడ్ లో చిన్న బ్యానర్ గా జర్నీని మొదలుపెట్టిన ఈ బ్యానర్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ బ్యానర్ కు అనుకున్న స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు. రీసెంట్ గా మిరాయ్(mirai) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న ఈ బ్యానర్, ఇప్పుడు ఆ సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తోంది.
తేజ సజ్జా(teja sajja) హీరోగా మంచు మనోజ్(manchu manoj), శ్రియ(sriya), జగపతి బాబు(jagapathi babu) ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజై మొదటి షో నుంచే భారీ రెస్పాన్స్ ను తెచ్చుకుని విపరీతమైన కలెక్షన్లను అందుకుంటుంది. మిరాయ్ సినిమా సక్సెస్ అవడంతో తమ బ్యానర్ నుంచి రాబోయే సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే తమ బ్యానర్ లో ఈ ఏడాది షూటిగ్ పూర్తైన మూడు సినిమాలను, 50% షూటింగ్ పూర్తైన మరో సినిమానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేసిందని, ఆ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసినా, వాటితో వచ్చే ఫలితాల వల్ల తమ బ్యానర్లో వచ్చే పెద్ద సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని, తద్వారా తమ బ్యానర్ క్రెడిబిలిటీ పోతుందని వాటిని క్యాన్సిల్ చేస్తున్నారంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.