దేవీ ఫోకస్ చేయాల్సిన టైమొచ్చింది!
కొందరు డైరెక్టర్లు టెక్నీషియన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా పర్టిక్యులర్ గా ఉంటారు. తమ కథను సరిగా అర్థం చేసుకునే వారితోనే పని చేస్తుంటారు. రాజమౌళి, సుకుమార్ ఈ లిస్ట్ లోనే ఉంటారు. వీరి కెరీర్లో ఒక్కసారి కూడా మ్యూజిక్ డైరెక్టర్లను మార్చింది లేదు. రాజమౌళి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తే, సుకుమార్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు.
ఇక అసలు విషయానికొస్తే దేవీ సరైన ఫామ్ లో లేనప్పుడు కూడా సుకుమార్ తనతోనే సినిమాలు చేశాడు. దేవీని నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు తను కూడా సుకుమార్ కు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పుష్ప వరకు వీరి బాండింగ్ అంతే కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు పుష్ప2కి వీరిద్దరి మధ్య సింక్ కుదరట్లేదని తెలుస్తోంది.
దేవీ ఇచ్చిన బీజీఎం నచ్చక సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్నాడనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దేవీని విసిగించి అయినా తనతో మంచి మ్యూజిక్ చేయించుకుంటూ వచ్చిన సుకుమార్ కు కూడా తనపై నమ్మకం పోయిందంటే దేవీ మ్యూజిక్ ఏ రేంజ్ కు పడిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రిస్టీజియస్ ప్రాజెక్టు రిలీజ్ ముందు బీజీఎం కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్నారంటే ఇది దేవీ శ్రీ ప్రసాద్ కు మామూలు డ్యామేజ్ కాదు. మరి దీన్ని దేవీ ఎలా తీసుకుంటాడో చూడాలి. ఇకనైనా దేవీ తన సంగీతంపై ఫోకస్ చేసి మంచి మ్యూజిక్ ఇవ్వకపోతే ఛాన్సులు తగ్గడం ఖాయం.













