Dude: దీపావళి సినిమాల్లో డ్యూడ్ కు భారీ క్రేజ్

ఒకప్పటిలా ఇప్పుడు సోలో రిలీజ్ లకు ఎక్కువ స్కోప్ ఉండటం లేదు. అందులోనూ పండగ సీజన్ అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది దీపావళికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అందులో మిత్రమండలి(mitramandali), డ్యూడ్(Dude), తెలుసు కదా(Telusu Kadha), కె ర్యాంప్(K Ramp) సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ నాలుగు సినిమాలకూ వేటికవే స్పెషల్ క్రేజ్ తో రిలీజ్ కానున్నాయి. అయితే అన్ని సినిమాల కంటే ఎక్కువగా డ్యూడ్ మూవీపైనే ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan) హీరోగా తెరకెక్కిన డ్యూడ్ మూవీ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. పైగా ట్రైలర్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. పైగా డ్యూడ్ సినిమాను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers). ఈ బ్యానర్ లో వస్తున్న సినిమా అంటే అందరికీ మంచి అంచనాలుంటాయి, పైగా భారీ రిలీజ్ దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ సినిమా చాలా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. చూస్తుంటే ఈ సినిమా ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై కాస్త ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది. మరి డ్యూడ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.