Hrithik Roshan: మెగాఫోన్ పడుతుంటే భయమేస్తుంది
హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రస్తుతం వార్2(war2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ ఎన్నో సినిమాలు చేసినా బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ క్రిష్ కు ఉన్న ఫాలోయింగే వేరు. ఈ ఫ్రాంచైజ్‌లో ఆల్రెడీ మూడు భాగాలుగా రాగా, నాలుగో పార్ట్ కు రంగం సిద్ధమవుతుంది. క్రిష్4 (Krish4) ను హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నాడు.
హీరో నుంచి డైరెక్టర్ గా మారుతున్న తరుణంలో హృతిక్ రీసెంట్ గా ఓ ఈవెంట్ లో దాని గురించి మాట్లాడాడు. తనకు చిన్నప్పట్నుంచే డైరెక్షన్ అంటే ఇష్టమని, అందుకే డైరెక్టర్ గా మారుతున్నానని, కానీ దాని గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు భయమేస్తుందని, ఈ రంగం తనకు పూర్తిగా కొత్తదని హృతిక్ రోషన్ వెల్లడించాడు.
దర్శకుడికి ఎన్నో సవాళ్లు ఉంటాయని, ఆ విషయం ఇప్పుడిప్పుడే తనకు అర్థమవుతుందని, డైరెక్టర్ గా అడుగుపెడుతుంటే కొత్తగా స్కూల్ లో జాయినట్లు ఉందని, డైరెక్టర్లు ఎన్నో అంశాలపై పరిశోధన చేయాలని, భవిష్యత్తులో అసలు ఎందుకు డైరెక్టర్ ను అయ్యానా అని అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పిన హృతిక్, ఆడియన్స్ అందిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఇదిలా ఉంటే హృతిక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్ హీరోగా కనిపిస్తూనే విలన్ పాత్ర కూడా చేస్తున్నాడని, పలువురు బాలీవుడ్ నటులు ఈ సినిమాలో కనిపించనున్నారని అంటున్నారు.













