వార్-2ని అప్పుడే ఫిక్స్ చేసేశారుగా!
ఇండియన్ సినిమాల్లోనే క్రేజీ కాంబోగా తెరకెక్కుతున్న వార్2 ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జనవరి 24, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ డెడ్ లైన్ పెట్టుకుందట. ఎప్పుడైనా సరే ఇలా డెడ్లైన్ ను అందుకోవడంలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్టైలే వేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైమ్ కి అవుట్పుట్ ని రెడీ చేసి రిలీజ్ చేస్తారు.
అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కాంబో కోసం వీరిద్దరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నువ్వా నేనా అని తలపడేలా వీరిద్దరి క్యారెక్టర్లను అయాన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది దృష్టిలో పెట్టుకునే తారక్ బర్త్ డే రోజు హృతిక్ యుద్ధభూమిలో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని టాక్.
ఇక హీరోల నుంచి డేట్లు కేటాయించడమే ఫైనలట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి వార్2 షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే జనవరి నుంచి ఎన్టీఆర్ వార్-2 సెట్స్ లోనే ఎక్కువగా ఉండబోతున్నాడన్నమాట.
వార్2 పూర్తి చేసేసరికి ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి తనతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ఎన్టీఆర్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో గ్యాప్ తో తీసుకుని టైమ్ వేస్ట్ చేసిన ఎన్టీఆర్ మొత్తానికి పది నెలల గ్యాప్ లోనే దేవర, వార్2 ని తో థియేటర్లలో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నాడన్నమాట.













