మంచి రిలీజ్ డేట్ పట్టిన వార్2
ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తయిన వెంటనే హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో డెబ్యూ చేయనున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించబోతున్న ఈ సినిమా 2025 ఆగస్ట్ 14న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అంటే ఆ రోజు గురువారం. ఇండిపెండెన్స్ డే ను కలుపుకుని నాలుగు రోజుల వీకెండ్ దొరకనుంది. నిజానికి వార్2 షూటింగ్ ఆ ఏడాది జనవరికే అయిపోయేట్లు ప్లాన్ చేశారు. కాబట్టి అందరూ రిపబ్లిక్ డే కు రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు టైమ్ సరిపోదేమో అన్న కారణంతో సినిమాను మరో ఆరు నెలల తర్వాత రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్2 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. వీరిద్దరూ డిసెంబర్ ఆఖరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ కానున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.













