కక్ష తీర్చుకోవాలనుకుంటున్న కంగనా….
ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆ చిత్రానికి మరింత ప్రచారం కల్పించడం కోసం.. సడెన్‌గా జూన్ 21 నుంచి జులై 26కి విడుదల తేది మార్చారు. ఆరోజు హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించి ఉన్నారు. హృతిక్‌తో కంగనాకు గల వివాదాల దృష్ట్యా మెంటల్ హై క్యా చిత్రాన్ని అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మెంటల్ హై క్యా చిత్రాన్ని జులై 26కి వాయిదా వేస్తున్నామని ప్రకటించిన మరుక్షణం.. తన సూపర్ 30 చిత్రాన్ని జులై 26 నుంచి వాయిదా వేస్తున్నామని హృతిక్ ప్రకటించారు. ఈ రోంపిలో దిగడం నాకిష్టం లేదు. అందుకే మా నిర్మాతను రిక్వస్ట్ చేసి సూపర్ 30 చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం అన్నాడు.













