Hilesso Hilessa: హైలెస్సో.. నెమలిని గుర్తు చేస్తుందట
సౌత్ లో సాయి పల్లవి(Sai Pallavi)కి ఉన్న క్రేజ్ వేరు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య(naga chaitanya) తో కలిసి చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తండేల్(Thandel) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్2(Geetha Arts2) భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తండేల్ నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజవగా అన్నీ పాటలూ ఛార్ట్ బస్టర్లుగా నిలవడంతో పాటూ మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన హైలెస్సో హైలెస్సా(Hilesso Hilessa) సాంగ్ అందరినీ బాగా మెప్పిస్తోంది. సాంగ్ చాలా బావుండటంతో పాటూ లిరికల్ వీడియోలో సాయి పల్లవి డ్యాన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తండేల్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vaasu) ఈ సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైలెస్సో సాంగ్ లో సాయి పల్లవి దాదాపు నిమిషం పాటూ నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేస్తుందని, ఆ డ్యాన్స్ చూసి అందరికీ నెమలి గుర్తొస్తుందని, లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువని, వెండితెరపై సాయి పల్లవి డ్యాన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ఆయన వెల్లడించాడు. దీంతో ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ చూస్తామా అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది.













