నా సామిరంగలో ఆ ఇద్దరు హీరోయిన్లు
ఎంతో గ్యాప్ తీసుకున్న తర్వాత నాగార్జున తన 99వ సినిమాను కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నా సామి రంగ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఆ ఇద్దరిలో ఒకరు ఆషిక రంగనాథ్. కన్నడ హీరోయిన్ అయిన ఆషిక అమిగోస్ సినిమాలో చేసింది కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఎలాంటి పాపులారిటీ రాలేదు. శాండల్‌వుడ్ లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి కానీ అమ్మడు టాలీవుడ్ లో ఛాన్సు ల కోసం, గుర్తింపు కోసం పాకులాడుతుంది. ఫైనల్ గా నాగ్ తో సినిమా లో ఛాన్స్ అందుకుంది.
ఇక రెండో హీరోయిన్ గా మిర్న మీనన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. క్రేజీ ఫెలో, ఉగ్రం సినిమాల్లో నటించినప్పటికీ మిర్నకు అవేమీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. రీసెంట్ గా జైలర్ లో రజినీకాంత్ కోడలిగా నటించింది. ఈ అమ్మడుకు కూడా నా సామి రంగలో ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ హీరోయిన్లు ఇద్దరూ వారికా లేక నాగ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. నా సామిరంగ సంక్రాంతికి రిలీజ్ కానుంది.













