Remunerations: స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్ల భారీ రెమ్యూనరేషన్లు
దేశ సినిమాలో డ్యాన్స్ నెంబర్లు ఎంతోకాలంగా భాగంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆ సాంగ్స్ ను హీరోయిన్స్ చేస్తూ వస్తున్నారో అప్పుడే వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. హీరోయిన్లు ఈ సాంగ్స్ చేయడంతో ఆ సాంగ్స్ ను స్పెషల్ సాంగ్స్ అంటూ పిలుస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్స్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఖర్చు పెడుతూ నిర్మాతలు ఆ సాంగ్ ను మరింత స్పెషల్ గా మారుస్తున్నారు. ఆ సాంగ్స్ ను స్టార్ హీరోయిన్లతో చేయించి అప్పటివరకు సినిమాపై ఉన్న బజ్ ను ఇంకాస్త పెంచుతున్నారు. హీరోయిన్ల డ్యాన్స్ తో సంబంధం లేకుండా వారి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో నిర్మాతలు వారికి ఎంత పారితోషికం అడిగితే అంత ఇస్తున్నారు.
ఈ రెమ్యూనరేషన్లు తీసుకునే లిస్ట్ లో టాప్ లో సమంత ఉంది. పుష్ప(Pushpa) సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత ఏకంగా హీరోయిన్ కంటే ఎక్కువ ఛార్జ్ చేసింది. పుష్ప కోసం రష్మిక(Rashmika) రూ.2 కోట్లు తీసుకుంటే సమంత(Samantha) మాత్రం రూ. 5 కోట్లు తీసుకుందని టాక్. ఇక స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ గా మారిన తమన్నా(Tamannaah)జైలర్(Jailer) లో కావాలయ్యా సాంగ్(Kaavalayya song)చేసి తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంది. ఆ తర్వాత స్త్రీ2(Stree2)లో ఓ సాంగ్ చేసింది. తాజాగా రైడ్2(RAID2) లో కూడా స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. రైడ్2 లో స్పెషల్ సాంగ్ కోసం తమన్నా కూడా రూ.5 కోట్లు ఛార్జ్ చేసిందని వార్తలొస్తున్నాయి.






