బ్యూటీ బిజినెస్ లో హీరోయిన్లు
తమ నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. రీసెంట్ గా ఎంతో మంది హీరోయిన్లు కొత్త కంపెనీలను స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలోకి ఎంటరవడమే కాకుండా ప్రజలకు టిప్స్ చెప్తున్నారు. అందం, చర్మ సంరక్షణ విషయంలో వారి ప్రభావాన్ని, టేస్ట్ ను తెలియపరిచేలా వారు తమ ఉత్పత్తులను స్టార్ట్ చేశారు. వారిలో దీపికా పదుకొణె, నయనతార, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, సన్నీలియోన్ తదితరులు ఉన్నారు. దీపికా 2022లో 82.E అనే బ్యూటీ కేర్ బ్రాండ్ ను మొదలుపెట్టి అదే పేరుతో ఇన్‌స్టాలో బాగా పాపులర్ అయింది.
నయనతార 2023లో 9SKIN అనే పేరుతో చర్మ సంరక్షణ బ్రాండ్ ను మొదలుపెట్టింది. ఇందులో మంచి చర్మ సంరక్షణ ఉత్పత్తులున్నాయి. నయనతార పేరుతోనే ఈ బ్రాండ్ కు ఇన్‌స్టాలో మంచి ప్రమోషన్స్ దక్కుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా అనోమలీ అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను స్టార్ట్ చేయగా, కత్రినా కైఫ్ 2019లోనే కే బ్యూటీని స్థాపించి మాయిశ్చరైజర్, క్లెన్సర్, మాస్క్ లాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రీసెంట్ గా కృతి సనన్ హైఫన్ అనే బ్రాండ్ ను మొదలుపెట్టి చర్మ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చింది. వీరితో పాటూ పలు పాపులర్ హీరోయిన్స్ వేరే వేరే బిజినెస్‌ల్లో బిజీగా ఉంటే వీరు మాత్రం సౌందర్య ఉత్పత్తులపైనే దృష్టి పెట్టారు.













