రామ్ ఇప్పటికైనా బయటకొస్తే బెటర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు వరుస ఫ్లాపులు రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో మూడు ఫ్లాపులు పడటం ఎవరికైనా బాధ కలిగిస్తుది. అయితే ఈ మూడు సినిమాలు ఫ్లాపులుగా మిగలడానికి కారణం రామ్ ఊర మాస్ ను కోరుకోవడమే. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన మాస్ ఇమేజ్ ను పెంచుకుని టైర్1 హీరోల్లోకి వెళ్లాలని రామ్ బాగా తాపత్రయ పడుతున్నాడు.
కేవలం ఈ అంశాన్ని మాత్రమే మైండ్ లో పెట్టుకుని దర్శకుడు తనను ఎలా చూపించాలనుకుంటున్నారే విషయంలో లోతైన విశ్లేషణ చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. గతంలో కూడా రామ్ ఇలాంటి మిస్టేక్స్ చేశాడు. శివమ్, హైపర్ సినిమాలతో దారుణంగా నష్టపోయాడు.
అయితే రామ్ లవర్ బాయ్ గా చేసిన సినిమాలన్నీ మంచి ఫలితాన్నే ఇచ్చాయి. నేను శైలజ్ సినిమాకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఉన్నది ఒకటే జిందగీ సూపర్ హిట్ అవకపోయినా డీసెంట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. రెడీ, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. రామ్ మాస్ జానర్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ కు నచ్చి హిట్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో వీలైనంత త్వరగా రామ్ ఈ ఊర మాస్ హ్యాంగోవర్ నుంచి బయటికొచ్చి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ తో పాటూ అందరూ కోరుకుంటున్నారు.













