తమిళంలోనూ సునీల్ హవా !
తెలుగులో చిన్న కమెడియన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ‘సునీల్’ , తరువాత స్టార్ కమెడియన్ గా దిన దినాభివృద్ధి చెందుతూ హీరోగా కూడా కొన్ని విజయాలు అందుకుని తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. గత రెండేళ్ళుగా తన కెరీర్ మంచి స్పీడ్ ట్రాక్ లో ఉందనే తెలుస్తుంది. కొన్ని పాత్రలే చేస్తానని కండిషన్లు లేకపోవడమే దానికి కారణం కావొచ్చు.
చిన్న చిన్న కామెడీ రోల్స్ నుండి గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అన్నీ చేస్తున్నాడు. అయితే తనకి తెలుగులో ఛాన్స్ రావడం గొప్పేమీ కావు. సునీల్ నటించిన పుష్ప మూవీని చూసి తన ప్రతిభను గుర్తించారు కోలీవుడ్ దర్శకులు. దాంతో పాటూ ఇటీవల బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘జైలర్’ మూవీలో సునీల్ వేషధారణ అందరినీ ఆకర్షితులని చేసింది.
ముఖ్యంగా తమన్నా మరియు సునీల్ మధ్య సాగే ఎపిసోడ్ లో నెక్స్ట్ లెవల్ యాక్టింగ్ అనే చెప్పాలి. రజినీకాంత్ కాంబినేషన్స్‌లో సీన్లు లేకపోయినా ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సునీల్ హ్యాపీగానే ఉన్నాడు. ఇంతకు ముందు తమిళ్లో కొన్ని పాత్రలు చేసినా వాటిని మించిన రోల్ ఒకటి సునీల్ కోసం సిద్ధంగా ఉందని తమిళ చిత్ర పరిశ్రమలో టాక్.
డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ సోదరుడు ఎల్విస్ హీరోగా రూపొందుతున్న మూవీ బులెట్. ఈ మూవీలో సునీల్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. దీనిలో హీరోయిన్ గా వైశాలి రాజ్ అనే తెలుగమ్మాయి పరిచయమవుతుంది. ఈ మూవీ లో లారెన్స్ కూడా ఒక క్యామియో చేయబోతున్నారని టాక్. సునీల్ పాత్ర గురించి ఏ వివరాలు లేనప్పటికీ తనని రికమండ్ చేసింది లారెన్స్ అని సమాచారం.













