రామ్ తో హరీష్ శంకర్ మూవీ?
గద్దలకొండ గణేష్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంతో గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ తో తమిళ బ్లాక్ బస్టర్ తేరీని ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పవన్ ఏపీ రాజకీయ పరిణామాల దృష్ట్యా సినిమాలను పక్కన పెట్టేశాడు. దీంతో ఈ సినిమా బాగా లేటయింది. ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి రీస్టార్ట్ అవడానికి మరింత టైమ్ పడుతుందని హరీష్ శంకర్, రవితేజతో బాలీవుడ్ మూవీ రైడ్ ను మిస్టర్ బచ్చన్ పేరిట రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత పవన్ డేట్స్ ఇస్తే తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలు పెడదామనుకున్నాడు హరీష్. కానీ ఏపీ ఎలక్షన్స్ లో జనసేన కూటమి గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నందున, పవన్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి మరింత టైమ్ పట్టనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ మరో సినిమాను సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
అయితే హరీష్ లిస్ట్ లో రామ్ పోతినేని ఉన్నాడని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమా హరీష్ డైరెక్షన్ లోనే అని తెలుస్తోంది. మరి రామ్ తో హరీష్ తీయబోయే సినిమా ఒరిజినల్ స్టోరీనా లేక రీమేక్ సినిమానా అన్నది తెలియాల్సి ఉంది. రామ్ తో చేయబోయే ఈ సినిమా హరీష్ కు మరింత క్రేజ్ తీసుకురాగలదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఏదేతేనేం హరీష్ ఇకపై తన టైమ్ ను వేస్ట్ చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయి, వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లున్నాడు.













