ఉస్తాద్ భగత్ సింగ్‌పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అవడంతో పరిపాలన వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. మరో మూడు నాలుగు నెలల వరకు ఆయన షూటింగ్ లకు హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. షూటింగ్స్ స్టార్ట్ చేసినా కూడా పవన్ ఒక సినిమా తర్వాత ఒకటి పూర్తి చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలో మొదలవదనే మాట వినిపిస్తోంది. పవన్ ఓజి, హరిహర వీరమల్లు పూర్తి చేశాకే ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే ఛాన్సుందట. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్, రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఎంతో వేగవంతమయ్యాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉంటుందని, ఆడియన్స్ పవన్ ను వెండితెరపై ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా కనిపిస్తారని తెలిపాడు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని స్పెషల్ గా చెప్పుకునే సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని, ఈ సినిమాకు అన్నీ అంశాలు బాగా సెట్ అయినట్లు హరీష్ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ చెప్పిన ఈ మాటలతో పవన్ ఫ్యాన్స్ కు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.













