Ustaad Bhagath Singh: పవన్ ఫ్యాన్స్ కు హరీష్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) తాను కమిట్ అయిన అన్ని సినిమాలను వరుస పెట్టి పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఓజి(OG) సినిమాను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) సినిమాను కూడా పూర్తి చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తేరీ(Theri)కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
గబ్బర్ సింగ్(Gabbarsingh) తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ లో భాగంగా హరీష్ శంకర్ ఓ క్రేజీ సాంగ్ ను పవన్ పై తెరకెక్కించారట. హరీష్ ఈ సాంగ్ ను చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేసినట్టు సమాచారం.
ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో ఫ్యాన్ బాయ్ అయిన హరీష్ శంకర్ నుంచి వచ్చే గిఫ్ట్ గా చిత్ర యూనిట్ మరీ మరీ చేస్తోంది. హరీష్ శంకర్ మరీ ఆ రేంజులో ఏం ప్లాన్ చేశారనేది వెండితెరపైనే చూడాల్సి ఉంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శ్రీలీల(sree Leela), రాశీ ఖన్నా(raashi khanna) హీరోయిన్లు గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) ఈ సినిమాను నిర్మిస్తోంది.







