పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ మొదలై నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ సినిమా పూర్తి కాలేదు. ఇక సినిమా రిలీజ్ గురించైతే ఫ్యాన్స్ కూడా ఆలోచించడం మానేశారు. మరికొందరు ఈ సినిమా క్యాన్సిల్ అయిందని, నిర్మాత ఏఎం రత్నంకు డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడని అన్నారు.
ఇలాంటి తరుణంలో వీరమల్లు నిర్మాణ సంస్థ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇరాన్, కెనడా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సమాంతరంగా జరుగున్నాయని, ఫ్యాన్స్ కు పెద్ద స్థాయిలో ఊహించని రీతిలో విజువల్ ట్రీట్ ఉండబోతుందని, టీజర్ ను ఆస్వాదించడానికి రెడీ గా ఉండమంటూ ట్వీట్ చేసింది.
ఈ అప్డేట్ చూడగానే పవన్ ఫ్యాన్స్ లో వేయి దీపాలు ఒక్కసారిగా వెలిగినట్లైంది. వీరమల్లు లేటవుతుండటంతో క్రిష్ మరో సినిమాను మొదలుపెట్టాడు. పవన్ కూడా ఏపీ ఎలక్షన్స్ అయ్యాక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈలోపు క్రిష్ సినిమా అయిపోతుంది. మొత్తానికి లేటయినా హరిహర వీరమల్లు అయితే రిలీజవుతుంది. క్యాన్సిల్ కాలేదనే విషయాన్ని ఫ్యాన్స్ కు అర్థమయ్యేట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.













