Prabhas: ఫౌజీ అసలు బ్రేకే పడట్లేదు
ప్రభాస్(Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజాసాబ్(the raja saab), హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్న ప్రభాస్ మోకాలి గాయం వల్ల డాక్టర్లు ఆయనకు విశ్రాంతి సూచించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఎలాగో బ్రేక్ దొరికింది కదా అని ప్రభాస్ ఇటలీకి వెకేషన్ కోసం వెళ్లాడు.
ఈ కారణంగా మారుతి ది రాజా సాబ్ షూటింగ్ ను ఆపేశాడు. దానికి తోడు రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా బాగా లేటవుతుండటంతో ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. కానీ హను రాఘవపూడి మాత్రం ప్రభాస్ లేకపోయినా ఆ సినిమా షూటింగ్ ను ఆపకుండా కంటిన్యూ చేస్తూ తన ప్లానింగ్ తో సినిమాను ముందుకు తీసుకెళ్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
వరల్డ్ వార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా షూటింగ్ ను హను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రభాస్ లేని సన్నివేశాలతో పాటూ, హీరోయిన్ ఇమాన్వి(Imanvi)పై సీన్స్ ను, మాంటేజ్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాడట హను. త్వరలోనే ప్రభాస్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్న నేపథ్యంలో అతనొచ్చాక ప్రభాస్ ఉన్న సీన్స్ ను తెరకెక్కించాలే ప్లాన్ చేసుకున్నాడట హను. అతని సమయస్పూర్తికి అందరూ హనును మెచ్చుకుంటున్నారు. ఫౌజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.






