ఇలా అయితే ఎలా జీవీ?
ఏదైనా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది పాన్ ఇండియా సినిమాల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కాస్త తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ ఆడియన్స్‌పై పడుతుంది. అనిరుధ్ ఓన్లీ తన బీజీఎంతో జైలర్, విక్రమ్ లాంటి సినిమాల స్థాయి పెంచిన వైనం మనం చూశాం.
అఖండ, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు కూడా ఈ లిస్ట్ లోకి వస్తాయి. టాలీవుడ్ లో ఈ మధ్య తమిళ మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎక్కువైపోతుంది. జీవీ ప్రకాష్ మనకు డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట సినిమాలకు మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. డబ్బింగ్ సినిమాలైన యుగానికి ఒక్కడు, షాపింగ్ మాల్ లాంటి సినిమాలు కూడా జీవీకి మంచి పేరు తీసుకొచ్చాయి.
ఆ నమ్మకంతోనే జీవీకి టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద సినిమా బాధ్యతను అప్పగించారు. ట్యూన్స్ విషయంలో ఫెయిల్ అయిన జీవీ, బీజీఎంతో అయినా ఆకట్టుకుంటాడేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ టైగర్ నాగేశ్వరరావు విషయంలో మ్యూజిక్ అతి పెద్ద మైనస్‌గా నిలిచింది. మంచి టాలెంట్ ఉన్న ప్రకాష్ ఇలాంటి స్కోర్ ఇవ్వడం షాకిస్తుంది. ఈ సినిమాకే ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడంటే ఇక తన నుంచి రాబోయే కెప్టెన్ మిల్లర్, ఆదికేశవ, తంగలాన్, ఎమర్జెన్సీ, జపాన్ ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. మరి రాబోయే సినిమాలతో అయినా జీవీ మెప్పిస్తాడేమో చూడాలి.













