36 ఏళ్లకే జీవీ 100వ సినిమా
ఈ రోజుల్లో ఓ మ్యూజిక్ డైరెక్టర్ 100 సినిమాల మైలు రాయిని అందుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. అది కూడా 36 ఏళ్ల వయసులోనే. ఒకప్పట్లా మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు నెలకో సినిమా చేసే పరిస్థితి లేదు. డైరెక్టర్ లాగానే వాళ్లు కూడా ఒక్కో సినిమాకు చాలానే టైమ్ తీసుకుంటున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఎక్కువ సినిమాలు వచ్చాయనుకుంటే మూడు లేదా నాలుగు సినిమాలు సంవత్సరానికొస్తాయి.
అలాంటిది తమిళ మ్యూజిక్ డైరెక్టర జీవీ ప్రకాష్ 36 ఏళ్ల వయసుకే 100వ సినిమా చేస్తున్నాడు. సూర్య, సుధా కొంగర కాంబినేషన్లో వస్తున్న సినిమాకు జీవీ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. రెహమాన్ మేనల్లుడైన జీవీ ప్రకాష్ తన 19వ ఏటనే వెయిల్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
ఆ సినిమా మంచి హిట్ అవడంతో తర్వాత మరెన్నో అవకాశాలు అందుకుని ఇప్పుడు సూర్యతో తన 100వ సినిమా చేస్తున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ను సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న జీవీకి ముందు ముందు మరెన్నో అవకాశాలు రావాలని ఆశిద్దాం.













