గుంటూరు కారం సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకు బ్రేకులు పడి షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ, మొదలైన దగ్గర నుంచి మాత్రం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని గుంటూరు కారం షూటింగ్ ను జరుపుకుంటుంది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నుంచి తర్వాత రాబోయే సాంగ్ అంతకుమించి ఉంటుందంటున్నారు. సెకండ్ సాంగ్ వచ్చే వారం రిలీజ్ కానుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఆ సాంగ్ మెలోడీ డ్యూయెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
తర్వాత వచ్చే రెండు పాటలు కూడా ఫుల్ మాస్ వైబ్రేషన్స్ తెప్పించేలా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా శ్రీలీల, మహేష్ ఇద్దరూ కూడా మాస్ స్టెప్పులేబోతున్నారని, లుంగీ డ్యాన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారంలో మరో మాస్ సాంగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని సమాచారం. గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.













