గుంటూరు కారం ఆ టార్గెట్ను రీచ్ అవడం అసాధ్యమే!
గుంటూరు కారం సినిమాతో రాజమౌళి సినిమా రికార్డుల దగ్గరికి వెళ్తామని కొన్ని నెలల క్రితం నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగవంశీ మాట్లాడిన టైమ్ లో గుంటూరు కారం సినిమాకు ఇంత పోటీ ఉంటుందని ఎవరికీ తెలియదు. గుంటూరు కారంతో పాటూ మరో రెండు సినిమాలు పోటీలో ఉంటాయనుకున్నారు.
తీరా చూస్తే సంక్రాంతి ఏకంగా 5 సినిమాలు బరిలోకి దిగాయి. ఇలాంటి కాంపిటీషన్ లో రాజమౌళి రికార్డులను టచ్ చేయడం అసాధమ్యే. సోలోగా వచ్చి ఉంటే ఈ సినిమా ఆ రికార్డులను అందుకోవడం సాధ్యమేమో కానీ ఇప్పుడు మాత్రం అది అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ పండితులు. సంక్రాంతికి రిలీజవుతున్న ప్రతీ సినిమా స్ట్రాంగ్ బ్యాకప్ తో వస్తున్నాయి.
సైంధవ్ కు సురేష్ బాబు ఓన్ థియేటర్లతో పాటూ ఏషియన్ ఫిల్మ్స్ తోడు కూడా ఉంది. హనుమాన్ కు మైత్రీ అండ ఉంది. నా సామిరంగకు అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ తో పాటూ గీతా ఆర్ట్స్ సపోర్ట్ కూడా ఉంటుందని టాక్. ఇక ఈగల్ కోసం ఇద్దరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. థియేటర్లు అన్ని సినిమాలకు సర్దుబాటు కావాలి కాబట్టి అందుకే ఈ పోటీతో గుంటూరు కారం రాజమౌళి రికార్డులను టచ్ చేయడం చాలా కష్టమే. సోలోగా రిలీజైన సలార్ సినిమానే ఆ మార్క్ ను టచ్ చేయలేకపోయింది అలాంటిది ఇంతటి కాంపిటిషన్ లో అది జరగడం అసాధ్యమే.













