గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే!
ఒకప్పుడు గోపీచంద్ హీరోగా నటించిన సినిమాలొస్తున్నాయంటే వాటికి ఓపెనింగ్స్ చాలా భారీగా ఉండేవి. కానీ గత కొంతకాలంగా గోపీకి ఏదీ కలిసిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ భీమా సినిమాపైనే ఉన్నాయి. ఈసారి కన్నడ డైరెక్టర్ హర్ష తో కలిసి మ్యాచో స్టార్ గోపీచంద్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భీమాను చేశాడు.
గోపీచంద్ మార్కెట్ ఎలా ఉన్నా సరే భీమా సినిమా కచ్ఛితంగా హిట్ అవాల్సిన అవసరం ఎంతో ఉంది. థియేట్రికల్ బిజినెస్ కనీసం రూ.25 కోట్లు అయినా చేయాల్సింది కానీ గోపీచంద్ మార్కెట్ బాలేకపోవడంతో ఓ పది కోట్లు తగ్గించుకుని రాజీ పడాల్లి వచ్చింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్ ను నిరాశ పరచనని గోపీచంద్ చాలా బలంగా చెప్తున్నాడు.
భీమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని అందుకే సినిమాపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నాడు గోపీచంద్. మార్చి 8న శివరాత్రి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు పోటీగా విశ్వక్సేన్ గామితో పాటు మలయాళ హిట్ ప్రేమలు కూడా ఉంది. ఈ రెండు సినిమాలను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. భీమా హిట్ అయితే గోపీచంద్ మార్కెట్ మళ్లీ పెరుగుతుంది. గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న భీమా సినిమా తనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి మరి.













