మైత్రిలో క్రాక్ కాంబో
రీసెంట్గా రావణాసుర సినిమాతో ప్రేక్షకుల్ని ఘోరంగా నిరాశ పరిచాడు మాస్ మహారాజా రవితేజ. రవితేజ నుంచి గతేడాది వచ్చిన ధమాకా, ఈ ఏడాది మొదట్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్లుగా నిలవగా రీసెంట్గా రావణాసుర మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు రవితేజ.
ఈ సినిమా తర్వాత రవితేజ మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల మైత్రీ వారికి చాలానే నష్టమొచ్చింది. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రవితేజ- మైత్రీ కాంబో రిపీట్ కాబోతుందని వార్తలొస్తున్నాయి.
అయితే వీరి కాంబినేషన్లో రవితేజ ఇప్పటికే సినిమా చేసిన క్రాక్ టీమ్ తో జత కట్టాలనుకుంటుంది మైత్రీ బృందం. రవితేజ కెరీర్లో క్రాక్ మంచి హిట్టుగా నిలిచింది. మరోవైపు రవితేజ కూడా క్రాక్ టీమ్ తో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అవుతుంది. ముహూర్తం చూసుకుని ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.
ఈ సినిమాలో ఎవరెవరు నటించనున్నారు? ఎవరు పనిచేయనున్నారనేది సినిమా అనౌన్స్ అయినప్పుడే తెలియనుంది. ధమాకా, వాల్తేరు వీరయ్యలతో ఫామ్ లోకి వచ్చాడనుకున్న రవితేజకు రావణాసుర దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో ఇప్పుడు తన ఆశలన్నీ టైగర్ నాగేశ్వరరావు మీదే పెట్టుకున్నాడు.













