బాలీవుడ్లో గట్టిగానే ప్లాన్ చేస్తున్న గోపీచంద్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. మైత్రీ మైవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ కథను ముందుగా రవితేజ తో చేయాలనుకుని అనౌన్స్ చేశాక, బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను కొంచెం మార్చి సన్నీ డియోల్ తో చేస్తున్నాడు గోపీచంద్.
కథ బాగా నచ్చడంతో సౌత్ లో మార్కెట్ పెంచుకోవచ్చనే ఉద్దేశంతో సన్నీ డియోల్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను గోపీచంద్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ లో మార్పులతో పాటూ హిందీ వెర్షన్ ను కూడా రెడీ చేస్తున్నాడట.
తెలుగు, హిందీ భాషల్లో బాగా రీచ్ రావాలన్న కారణంతో రెండు భాషలకు సంబంధించిన ఆర్టిస్ట్ లను కీలక పాత్రల కోసం తీసుకోనున్నాడట గోపీచంద్. టెక్నికల్ టీమ్ ను కూడా సౌత్ నుంచే తీసుకునే అవకాశముంది. వీర సింహారెడ్డి తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో పాగా వేశాడు. ఈ సినిమా సక్సెస్ అయితే గోపీచంద్ కు కూడా బాలీవుడ్ నుంచి అవకాశాలు రానున్నాయి.













