గోపీచంద్ సినిమాకు టైటిల్ ఖరారు
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సీటీమార్ అనే టైటిల్ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్గా తమన్నా నటిస్తున్నారు. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్ చేసిందట. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.













