మాస్ విందు రెడీ చేస్తున్న గోపీచంద్
క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో తెరకెక్కిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో హీరోగా రవితేజను అనుకున్నారు కానీ కుదర్లేదు. తర్వాత ఆ సినిమాను సన్నీ డియోల్ తో స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు.
కొంతకాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న సన్నీ డియోల్ గదర్2 తో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఆయనతో మళ్లీ సినిమాలు చేయాలని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నట్లు డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎక్స్‌లో తెలిపారు. పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను సన్నీ డియోల్ పై తీస్తున్నామని, ఓ భారీ మాస్ మసాలా విందు రెడీ అవుతుందని గోపీచంద్ ట్వీట్ చేశాడు. గోపీచంద్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ ను దున్నేస్తున్న టైమ్ లో గోపీచంద్ ఈ సినిమాతో అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.













