రేట్లు తగ్గడంతో ఎగబడుతున్న ఆడియన్స్
లాస్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి 2898ఏడీ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ అయ్యాక అన్నీ సినిమాల్లానే కల్కి కూడా కాస్త డల్ అయింది. ఓ మోస్తరు కలెక్షన్లతో వీక్ డేస్ ను నెట్టుకొచ్చింది. కానీ బయ్యర్లు కల్కిని భారీ మొత్తానికి కొనడంతో సెకండ్ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తేనే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. అయితే రెండో వీకెండ్ లో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో కల్కి సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో కల్కి థియేటర్లు జనాలతో నిండిపోయింది.
ఈ విషయంలో టికెట్ రేట్స్ సాధారణ స్థాయికి రావడం ప్లస్ అయినట్లు అనిపిస్తోంది. ఫస్ట్ వీక్ దాదాపు రూ.100 వరకు ఎక్స్ట్రా రేట్ పెట్టాల్సి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెనుకంజ వేశారు. సినిమా పిచ్చి ఉన్నోళ్లు మాత్రమే ఫస్ట్ వీక్ లో చూశారు. రేటు చూసి వెనుకడుగు వేసిన ఆడియన్స్ అంతా ఇప్పుడు నార్మల్ రేట్లు అందుబాటులోకి రావడంతో సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. అందుకే ఇప్పుడు కల్కి కి ఆక్యుపెన్సీ పెరుగుతుంది.













