సూపర్ స్టార్ అభిమానులకు తీపికబురు
మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయన కొత్తసినిమా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో ఆయన తదుపరి మూవీ కన్ఫర్మ్ అయినట్టు టాక్ విన్పిస్తోంది. 2021లో చివరల్లో లేదా 2022 ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక రాజమౌళితో మూవీ అంటే అది భారీ చిత్రం అని అంటున్నారు. ఈ చిత్రం దాదాపు రెండేళ్లకు పైనే షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంటుంది. అంటే రాజమౌళితో మూవీ మొదలుపెట్టాక కనీసం రెండేళ్ల వరకు వేరే సినిమా చేసే అవకాశం ఉండదు. కావున ఈ లోపే మహేష్ రెండు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. పరుశురామ్ మూవీతో పాటు మరో చిత్రంలో ఆయన నటించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. రాజమౌళి సినిమా టైంలో ఏర్పడే గ్యాప్‌ని ఈ విధంగా పూరించాలని ఆయన అనుకుంటున్నారట. మరి ఒక విధంగా ఇది మహేష్ అభిమానులకు తీపి కబురు అని అంటున్నారు.













