Samantha-Keerthy Suresh: కీర్తి, సమంతల బాండింగ్ భలే ఉందే!

అందరిలానే హీరోయిన్లకు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటూంటారు. ఫ్రెండ్స్ అంటే ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే ఉండాలని షరతులేం లేవు. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ అందుకున్న సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu), కీర్తి సురేష్(Keerthy Suresh) ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టు ఇప్పటికే పలుసార్లు తెలిపారు.
ఇప్పుడు మరోసారి వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను బయటపెడుతూ వారి స్నేహానికి ఎలాంటి బార్డర్లు లేవని నిరూపించారు. సమంత తన క్లాత్ బ్రాండింగ్ స్టోర్ అయిన సాకి(Saaki) నుంచి కీర్తికి కొన్ని అవుట్‌ఫిట్స్ ను పంపగా, దాని గురించి కీర్తి నెట్టింట షేర్ చేసింది. ఆ గిఫ్ట్ హ్యాంపర్ ను చూసిన కీర్తి సమంతకు థ్యాంక్స్ తెలియచేసేలా ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.
ఇంత అందమైన హ్యాంపర్ ను పంపినందుకు సాకి, సమంతకు థ్యాంక్స్ అని కీర్తి రాసింది. కీర్తికి సమంత పంపిన గిఫ్ట్ హ్యాంపర్ కేవలం వారి మధ్య పరిచయాన్ని మాత్రమే కాకుండా తమ మధ్య అనుబంధాన్ని కూడా తెలియపరుస్తుంది. సినిమాల విషయానికొస్తే సమంత రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey Bunny) సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాగా, కీర్తి సురేష్ ఇటీవలే తన బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్(Baby john) తో ప్రేక్షకుల్ని పలకరించింది. గతంలో వీరిద్దరూ కలిసి మహానటి సినిమా కోసం పని చేసిన విషయం తెలిసిందే.