భీమాకు సూపర్ ఛాన్స్
మ్యాచో స్టార్ గోపీచంద్ ఎప్పటినుంచో మంచి హిట్ కోసం మొహం వాచేలా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ హీరోగా మార్చి 8న రిలీజ్ కానున్న సినిమా భీమా. ట్రైలర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. వరుస డిజాస్టర్ల దెబ్బకు గోపీచంద్ మార్కెట్ బాగా ఢీలా పడిపోయింది. అలా అని అతని సినిమాలకు ఆదరణ లేదా అంటే అదేమీ లేదు.
ఇప్పటికీ గోపీచంద్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. భీమా డైరెక్టర్ హర్షకు కన్నడలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. శివరాజ్ కుమార్ తో నాలుగు సినిమాలు చేస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక పునీత్ రాజ్ కుమార్ తో చేసిన అంజనీ పుత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ టచ్ ఇవ్వడంలో హర్ష స్పెషలిస్ట్.
అందుకే భీమా ట్రైలర్ చూశాక అందరికీ సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఏమంత ఆశాజనకంగా లేదు. అందులోనూ మాస్ సినిమాలేవీ రాలేదు. మధ్యలో ఈగల్ లాంటి సినిమలొచ్చినా అది అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భీమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మామూలు లక్ కాదు. ఈ సినిమాతో పాటూ గామి కూడా రిలీజ్ అవుతుంది. కానీ రెండు సినిమాల జానర్లు వేరు కాబట్టి దేని ఆడియన్స్ దానికి ఉంటారు.













