గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రౌడీ హీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. షూట్ పూర్తైనట్లు విజయ్ దేవరకొండ, మృణాల్, డైరెక్టర్ పరశురామ్ ఓ వీడియో ద్వారా తెలిపారు.
త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. లైగర్ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న విజయ్, ఖుషి సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో తన సత్తా ఏంటో చాటాలని విజయ్ ప్రయత్నిస్తున్నాడు. విజయ్ అనుకున్నది సాధించడానికి అన్నీ కలిసొచ్చేలానే కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ కాకుండా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావడం లేదు. ఇది విజయ్ కు మామూలు బంపర్ ఆఫర్ కాదు. సినిమా రిలీజయ్యాక వరుసగా ఉగాది, ఈద్ వస్తున్నాయి. సినిమాకు మౌత్ టాక్ బాగుంటే మిగిలినదంతా విజయ్ చూసుకుంటాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. దిల్ రాజు కూడా ఫ్యామిలీ స్టార్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి విజయ్ ఫ్యామిలీ స్టార్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













