మీనాక్షికి ఇది భలే ఛాన్స్
అందం, టాలెంట్ రెండూ ఉన్నప్పటికీ మీనాక్షి చౌదరికి సరైన బ్రేక్ త్వరగా దక్కలేదు. రీసెంట్ గా గుంటూరు కారంలో ఛాన్స్ అందుకున్న అమ్మడుకు ఆ సినిమాలో నటించిందన్న ఆనందం ఏ మాత్రం దక్కలేదు. సినిమాలో ఆమె పాత్రకు అసలు ప్రాధాన్యతే ఉండదు. అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని ఆచితూచి అడుగులేస్తుంది మీనాక్షి.
ప్రస్తుతం మీనాక్షి చేతిలో వరుణ్ కు జోడీగా నటిస్తున్న మట్కా, దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న లక్కీ భాస్కర్, విజయ్ తో కలిసి నటిస్తున్న గోట్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో రానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా మీనాక్షినే తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి.
చిరంజీవి విశ్వంభర లో కూడా ఓ పాత్రకు మీనాక్షి ఎంపికైందని గత కొన్నాళ్లుగా నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ రెండు సినిమాలు మీనాక్షి అకౌంట్ లో పడితే అమ్మడి కెరీర్ మారిపోయినట్టే అనుకోవాలి. ఇప్పటికే వరుస డిజాస్టర్లతో శ్రీలీల క్రేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఈ అవకాశాన్ని మీనాక్షి భలే వాడుకుంటుంది. అంతేకాదు తమిళ హీరో విజయ్ తో నటిస్తున్న గోట్ సినిమాకు మంచి రిజల్ట్ వస్తే మీనాక్షికి తెలుగులో పాటూ తమిళంలో కూడా వరుస అవకాశాలు వచ్చే ఛాన్సుంది.













