Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం 500 కిలోల ఆభరణాలు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu). కరోనా ముందు మొదలైన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజైంది లేదు. పలు కారణాల వల్ల ఎన్నో వాయిదాలు పడిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే పూర్తైంది. త్వరలోనే వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. వీరమల్లు సినిమా కాస్ట్యూమ్స్ కోసం 1000 తాన్లకు పైగా కాటన్ ను వాడారని, సినిమా మొత్తం మీద పవన్(Pawan) 20 ఔట్ఫిట్స్ లో కనిపించగా వాటిలో ఎక్కువ ధోతీ, కుర్తీలే ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో పవన్ వేసుకున్న బట్టలన్నీ 90% కాటన్, 10% సాగదీయగల స్వెడ్ తో తయారైనట్టు సమాచారం.
వీరమల్లు పాత్ర కోసం స్పెషల్ గా వెంకటేశ్వరరావు(Venkateswara Rao) అనే అతను 20 జతల తోలు చెప్పులను తయారు చేశారు. అంతేకాదు ఈ సినిమా కోసం రూ.3 కోట్ల విలువైన 500 కిలోల ఆభరణాలను వాడారట. వాటిలో ఎక్కువగా పురాతన బంగారం, వెండి, ఖరీదైన రాళ్లు, ముత్యాలతో కూడిన నగలున్నాయని, సినిమాలో రాజరికపు లుక్ రావడం కోసం నిధి అగర్వాల్(Niddhi Agerwal), బాబీ డియోల్(Bobby Deol) కు నిజమైన బంగారు ఆభరణాలనే వాడినట్టు తెలుస్తోంది.






