యష్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో?
కెజిఎఫ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ యంగ్ హీరో యష్. కెజిఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, తన తర్వాతి సినిమాను గీతూ మోహన్ దాస్ తో చేస్తున్నట్లు ప్రకటించాడు. టాక్సిక్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గోవా బ్యాక్ డ్రాప్లో డ్రగ్స్ మాఫియా మీద నడవనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని కన్నడ సినీ వర్గాలంటున్నాయి. ఈ సినిమా కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకోవడంతో పాటూ ఎంతో కష్టపడి మేకోవర్ కూడా చేశాడు. టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
టాక్సిక్ లో ఓ కీ రోల్ కోసం గీతూ మోహన్ దాస్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ కావడంతో ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలివేట్ కావాలంటే షారుఖ్ రేంజ్ హీరో అవసరమని ఆయన్ను సంప్రదించిందట. గత కొన్నాళ్లుగా గెస్ట్ రోల్స్ కు దూరంగా ఉంటున్న షారుఖ్ ఈ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. పఠాన్ లో చేసిన కారణఃగా సల్మాన్ కోసం టైగర్3 లో నటించి రుణం తీర్చుకున్నాడు కానీ కెరీర్ ఊపులో ఉన్న టైమ్ లో గెస్ట్ రోల్స్ చేసి టైమ్ వేస్ట్ చేసుకోడని ముంబై వర్గాలంటున్నాయి.













