సీక్వెల్ కి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ సినిమా..!?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ” గీతా గోవిందం “. పరశురాం దర్శకత్వంలో మినిమం బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా వెండి తెరపై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాగా గీతగోవిందం రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించిన విజయ్, రష్మిక కి ఎంతో క్రేజ్ వచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశం మనసుకి హత్తుకునే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు.
ఇదిలా ఉండగా దర్శకుడు పరశురాం సర్కారువారి పాట సినిమా తర్వాత మరే సినిమాకి కమిట్ అవ్వలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నప్పటికీ అవి సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ తరుణంలో డైరెక్టర్ పరశురాం మరో కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గీతా గోవిందం సినిమా కి సీక్వెల్ రాబోతుంది అంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. నిర్మాత బన్నీ వాసు కి కూడా ఈ సినిమా తర్వాత సరైన హిట్స్ పడకపోవడంతో గీతా గోవిందం 2 తో మరోసారి తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడని సమాచారం.
అయితే ఈ సీక్వెల్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నే హీరో గా నటిస్తాడా, లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధింది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక హీరోయిన్ రష్మిక కూడా అటు బాలీవుడ్, ఇటు పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉండడంతో కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నట్లు టాక్. ఫైనల్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని తర్వాత కాస్ట్ అండ్ క్రూ ని అనౌన్స్ చేసే దిశగా మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గీతా గోవిందం ఏ విధంగా అయితే ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులకి ఫీల్ ని అందించిందో, అదే విధంగా ఈ సినిమా సీక్వెల్ గీతా గోవిందం 2 కూడా సక్సెస్ ని అందుకోవాలని కోరుకుందాం.













