Nikhil Siddharth: ఆ లుక్ కోసం 8 నెలల పాటూ అన్నం మానేశా: నిఖిల్
కార్తికేయ2(Karthikeya2) సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్(Nikhil). కానీ ఆ తర్వాత అతన్నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. దీంతో ఇప్పుడు నిఖిల్ ఫోకస్ మొత్తం భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamachari) దర్శకత్వంలో రూపొందుతున్న స్వయంభు(Swayambhu) సినిమాపైనే ఉంది. హిస్టారికల్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు.
అందుకోసం నిఖిల్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ తనను తాను మేకోవర్ చేసుకుంటున్నాడు. స్వయంభు కోసం తన మేకోవర్‌కు ఎంతో కష్టపడినట్టు నిఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాని కోసం 8 నెలల పాటూ ఎంతో కఠినమైన ఆహార నియమాలు పాటించానని, మద్యం పూర్తిగా మానేసి, అన్నం, షుగర్ లేకుండా అవకాడో, దానిమ్మ, ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నట్టు నిఖిల్ తెలిపాడు.
చూడగానే యుద్ధ వీరుడిగా కనిపించాలని ట్రై చేశానని, కాకపోతే దానికి చాలా సమయమే పట్టిందని నిఖిల్ తెలిపాడు. దాని కోసం గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీతో పాటూ పలు విద్యల్లో శిక్షణ తీసుకున్నానని, ఆర్ఆర్ఆర్(RRR) లో ఎన్టీఆర్(NTR), చరణ్(Ram Charan)కు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన కింగ్ సోలోమాన్(King Soloman) వద్ద వియత్నాంలో 45 రోజుల పాటూ ట్రైనింగ్ తీసుకున్నానని, ఆయన నుంచి రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకున్నట్టు నిఖిల్ పేర్కొన్నాడు.













