అప్పుడే ఓటీటీలోకి రానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
సినిమా థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ రిలీజ్ కు మధ్య సరిపోయినంత గ్యాప్ ఉండాలని ఎప్పట్నుంచో ఎన్నో డిమాండ్లు వినిపిస్తున్నా సరే నిర్మాతలు మాత్రం దానికి కట్టుబడటం కష్టమైపోతుంది. మొన్న మే 31న ఎన్నో అంచనాల మధ్య రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది. అవును, ఈ సినిమా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ అంచనాలను అందుకోని మాట నిజమే కానీ మరీ దారుణమైన వసూళ్లైతే లేవు. చిత్ర యూనిట్ అయితే ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా 80% రికవరీ జరిగిందంటోంది. ఇంకా ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అలాంటప్పుడు ఈ సినిమా అంత త్వరగా ఓటీటీలో వచ్చేయడం దేనికి సంకేతమిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ డెసిషన్ ఇప్పటికిప్పుడు తీసుకుందనుకోవడానికి వీల్లేదు. అగ్రిమెంట్ టైమ్ లోనే చాలా క్లియర్ గా డేట్ తో సహా లాక్ చేసుకుంటారు. సో ఫలితాన్ని ముందే ఊహించి నిర్మాత నాగవంశీ డీల్ కుదుర్చుకున్నాడా లేక త్వరగా స్ట్రీమ్ చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ నాగవంశీకి ఎక్కువ ఆఫర్ చేసిందా అనేది తెలియదు. గతంలో ఇదే సంస్థ నుంచి వచ్చిన గుంటూరు కారం, టిల్లు స్వ్కేర్ కూడా నెల రోజుల తర్వాతే నెట్ఫ్లిక్స్ లోకి రాగా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం రెండు వారాలకే రావడం ఊహించలేదు. కొత్త సినిమాల హక్కుల విషయంలో ఎంతో దూకుడు చూపిస్తున్న నెట్ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సర్ప్రైజ్లు చాలానే ఇచ్చేలా ఉంది.













